అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అన్నం లో ప్రాణ శక్తి ఉంది.
అన్నం సాక్షాత్ అమ్మవారి స్వరూపం.
ప్రపంచం లో అన్ని ఉపాధుల జీవనోపాధులకి మూలం అన్నం.
ఇది నేను పెద్ద వారి నుంచి విన్న మాట ! మనకి ఆకలి వేళకి ఎవరన్నా ఎదురొచ్చి శుచి గా వండిన ఆహారాన్ని పెడతానంటే ఎటువంటి ఆహంకారం లేకుండా ఆనందం గా, తృప్తి గా ఆ భోజనాన్ని అంగీకరించాలి. సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి ఆ మనిషి రూపం లో మనకి అన్నం పెడుతున్నట్టు అర్థం.
ఒక వ్యక్తి కి పది లక్షలు ఉంటే కోటి రూపాయలు లేవని బాధ ఉండొచ్చు. ఒక వ్యక్తి కి తల దాచుకునేందుకు ఒక ఇల్లు ఉన్నాక ఇంకో పెద్ద ఇల్లు కావాలన్న ఆశ రావచ్చు. ఆకలి తో ఉన్న మనిషికి అన్నం పెడితే - కడుపు నిండితే చాలు - తృప్తి వస్తుంది.
సాధ్యమైనంత వరకు "అన్నం వద్దు " అనే మాట కానీ ఆలోచన కానీ ఎవరికీ ఉండకూడదు. అన్నాన్ని ఏ నాడూ అవమానించకూడదు, తిరస్కరించకూడదు.
అన్నిటి కన్నా ముఖ్యం - "అన్నాన్ని ఎన్నడూ వృధా చెయ్యకూడదు"