తండ్రికి కూతురు బంగారు తల్లి, వరాల మూట.
కూతురు పుట్టిన తర్వాత తండ్రి వ్యక్తిత్వం సమూలంగా మారిపోతుంది. యవ్వనంలో ఉండే ఆగ్రహం,ఆవేశం స్థానంలో విచక్షణ, మెళకువ వస్తాయి. కూతురు ఎదుగుతున్న కొద్దీ తండ్రి ఒక్కొక్క పార్శ్వంలో తనను తను దిద్దుకుంటూ పరిపూర్ణమైన వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించుకుంటాడు. తండ్రికి సాక్షాత్తు ఇంకొక జన్మ వంటి పరిపూర్ణ అస్తిత్వాన్ని ఇచ్చేది కూతురు.
సాక్షాత్తు జగన్మాత ని కూతురిగా పొందిన హిమవంతుడి అదృష్టాన్ని ఏమని పొగడగలం ?
తన సంకల్ప మాత్రంతోనే లోకాలన్నిటినీ సృజించగల పరమ శక్తి స్వరూపిణి పసి బిడ్డలా మారి హిమవంతుడి చేతుల్లో బంగారు బొమ్మలా కేరింతలు కొట్టింది. సమస్త ప్రాణి కోటికి అన్నాన్ని ఇచ్చి పోషించి లోకాన్ని నడిపే తల్లి హిమవంతుడి చేతి గోరుముద్దలు తిన్నది. సర్వ లోకులనూ పసి బిడ్డలని చేసి ఆడించే అమ్మ, హిమవంతుడి ఒడిలో పసి బిడ్డ రూపంలో ఆడింది. అనంత సూర్య కోటి ప్రభా సమానమైన వెలుగులని చిందించే అమ్మవారు, హిమవంతుడి కనుల వెలుగుగా ఎదిగింది.
అమ్మవారిని పరమ శివుడికి కన్యా దానం చేసే మధుర క్షణంలో, హిమవంతుడి మనసు ఎంత ఉప్పొంగి ఉంటుందో ? సర్వ లోకాల ఏలిక అయిన పరమ శివుడికే పార్వతి అమ్మవారిని కన్యాదానం చెయ్యగలిగిన తన భాగ్యానికి ఎంత ఉద్వేగాన్ని అనుభవించి ఉంటాడో ? ఎవరిని మించి అధికుడు అనేవాడు విశ్వంలోనే లేడో, అటువంటి పురుషోత్తముడి మామగారిగా తనని పుట్టిన్చినందుకు అమ్మవారిని ఎన్ని రకాలుగా ధ్యానించి ఉంటాడో ?
పార్వతి, హిమజ, హైమవతి - అని తన కుమార్తెగా నామము ధరించి, తనని శాశ్వతంగా ప్రసిద్ధం చేసి, తన జన్మని ధన్యం చేసిన అమ్మవారి కరుణా రస సాగరంలో మునిగిన హిమవంతుడు ఏమి భావించి ఉంటాడు ? ఆ భావం యొక్క ఉన్నతిని వర్ణించడానికి భాష సరిపోదు.
అందరు లౌకిక మానవుల లాగే ఒక్క మాట మాత్రం అనుకుని ఉంటాడు - "ఈమె నా కడుపున పుట్టిన కుమార్తె కాదు, ఈమె సాక్షాత్తు నను కన్నతల్లి. నాకు మళ్లీ నడకలు నేర్పించి నన్ను సాకడానికి వచ్చిన నా బంగారు తల్లి" అని.

No comments:
Post a Comment