వాక్కు కి అర్థం లా, గాత్రం లో పలికే గానం లా అమ్మ వారిది అయ్య వారిది అవినా భావ సంబంధం. బిడ్డల ను కరుణించడానికి ఒకరు భువి లో అవతరిస్తే ఇంకొకరు వెంట సాగి వచ్చేస్తారు. అటువంటి ఆ ఆది దంపతుల అనురాగ కళ్యాణ కమనీయ సీమ మన కాంచీపురం.
ఏకామ్ర నాథుని ఆలయం లో కళ్యాణ మూర్తులుగా వెలసిన అమ్మ వారు, అయ్య వారు నిత్య శుభ మంగళ ములతో శోభిల్లే ఆనంద తత్త్వానికి ప్రతీకలుగా కనిపిస్తారు. అమ్మ కామాక్షి గా భువి ని పునీతం చేసి అయ్య వారి చెయ్యి అందుకోవడం కోసం మామిడి చెట్టు కింద తపస్సు మొదలు పెట్టింది. స్వామి వచ్చి అమ్మ చెయ్యి అందుకోగానే తపో భూమి లా ఉన్న మామిడి చెట్టు ఒక్క సారి గా మామిడి తోరణాలు గా మారి కాంచీపురం కళ్యాణ మంటపం అయ్యింది.
పార్వతి అమ్మ వారికి స్వామి మీద ఉన్న అనురాగం అనన్య సామాన్యం. ఇంకొక వైపు స్వామి వారికి ఆమె మీద కల అనురాగం అనంతం, అతి మధురం. విశాలాక్షి అమ్మ కి విశ్వ నాథుడి గా, మధుర మీనాక్షి కి సుందరేశ్వరుడి గా, బెజవాడ దుర్గమ్మ కి మల్లికార్జునుడి గా, జ్ఞాన ప్రసూనాంబ కి కాళ హస్తీశ్వరుడి గా - అమ్మ వారు ఎక్కడెక్కడ ఉంటే అయ్య వారు అక్కడక్కడ అవతరించి ఆమె చెయ్యి అందుకుని లోకాలని పాలిస్తున్నారు.
శివ పార్వతుల కళ్యాణం అంటే ఈ భూ మండలానికి శుభ ప్రదం, సౌభాగ్య దాయకం. అంతటి అపూర్వ ఘట్టానికి వేదిక కాంచీపురం.
***పల్లవి***
కళ్యాణ మంటపము నిత్య శోభితము
కథలన్ని దరి చేరు కాంచికా పురము
*** చరణం ౧ ***
వరద రాజుని చెల్లి బంగారు తల్లి
ఈశు హృది రంజిల్లు శ్రీ కల్ప వల్లి
లింగ రాజుని ఎదన నిత్య సిరి మల్లి
శంకరుని మది విరియు నిండు జాబిల్లి
మామిళ్ళ నీడ లో గౌరమ్మ తపము
స్వామి దరి చేరగనే పచ్చ తోరణము
*** చరణం ౨ ****
వాక్కు నేలు అర్థమై గాత్ర మందు గానమై
తెల్ల కొండ సామి వచ్చి కంచి రాణి పాణి పట్టె
సుందరీసుడు వాడు మీనాక్షి గూడి
ఇంద్ర కీలాద్రి వెలసె దుర్గమ్మ మగడు
ఎంత మది సొగసమ్మఏకామ్ర నాథుకి
కామాక్షి కలల పంట కళ్యాణ పల్లకి
No comments:
Post a Comment