పీఠికా పురం - పిఠాపురం
ఇది దేవ భూమి. ఇక్కడి ప్రతి అణువు దైవం నడయాడిన పవిత్ర భూమి.
పిఠాపురం లో మొదట శ్రీ పాద వల్లభ సంస్థానానికి వెళ్ళాము. ఇప్పటి వరకు దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై ఎందరో సామాన్యులను ఉద్ధరించి, వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం. ఆ సంస్థానం లో ఉచిత వసతి, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయి. ఆయన నీడలో ఎందరో దుఃఖం అనే మాటని పూర్తి గా మరచి ఆనంద సముద్రం లో ఓలలాడుతున్నారు. అక్కడ కొన్ని గంటలు ప్రశాంతత పరుచుకున్న వాతావరణం లో గడిపాము. అక్కడ ఔదుమ్బర వృక్షానికి ప్రదక్షిణ చేశాము.
అక్కడ నుంచి పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి అయిన కుంతీ మాధవ స్వామి ఆలయానికి వెళ్ళాము. అతి ప్రాచీనమైన అద్భుతమైన గుడి అది, యుగ యుగాల నాటి ఆలయం అది.
అక్కడి నుంచి స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి, పురుహుతాంబ శక్తి పీఠం, స్వయంభూ దత్తాత్రేయ మూర్తి ఉన్న పాద గయా క్షేత్రానికి వెళ్ళాము. స్వయం గా ధర్మ పరుడైనా తన వర్గం లోని వ్యక్తుల అధర్మ వర్తనాన్ని ప్రోత్సహించినందుకు, పాప పుణ్యాల ధర్మ చక్ర మార్గానికి అడ్డుగా నిలిచినందుకు త్రిమూర్తులచే శిక్షింప బడిన గయాసురుడు - శిరో గయ (అధిదేవత విష్ణువు, మంగళ గౌరీ శక్తి పీఠం), నాభి గయ (అధిదేవత బ్రహ్మ, విరజా దేవి శక్తి పీఠం), పాద గయ (అధిదేవత శివుడు, పురుహూతికా శక్తి పీఠం) - అనే మూడు క్షేత్రాల రూపం లో పూజనీయుడు అయ్యాడు. పాద గయా క్షేత్రం లో ఉన్న సరోవరం లో గయుడి పాదాలు ఉన్నాయని నమ్మకం. ఆ పవిత్ర కోనేటి నీటిని తలపై చల్లుకుని పురుహూతికా అమ్మ గుడి లోకి అడుగుపెట్టాము.
అమ్మ దేదీప్యమానం గా వెలుగుతోంది. అమ్మ తేజస్సు కనుల నిండా, మనసు నిండా పరుచుకుంది. సంధ్యా సమయంలో , దీప కాంతులలో అమ్మ కనులు, వంపులు తిరిగిన కను రెప్పలు, ముక్కెర, బేసరి - ధగ దగా కాంతులు చిమ్ముతున్నాయి. మా అమ్మ, పెద్దమ్మలు లలితా సహస్ర నామ పారాయణం చేశారు, ఈ జగజ్జననిని చూస్తూ - ఎదురుగా కూర్చుని. గంటలు గడిచాయి, అమ్మ ప్రేమ పూరితమైన దర్శనం గంటలను కరిగించేస్తోంది.
ఎన్నో రోజుల నుంచి నాలో అహంకారం జడలు విప్పుకుంది, పురుహూతికా అమ్మవారి విశిష్టత గురించి కొంచెం తక్కువగా ఆలోచించే అజ్ఞానం నాలో పాతుకు పోయి ఉంది. పిఠాపురం లో పురుహూతికా అమ్మవారి తేజస్సు భరించలేక అమ్మ వారి విగ్రహం భూమి లో దాచేశారని, ఇప్పుడు ఉన్న విగ్రహం నవీన కాలం లో ప్రతిష్ట చేసారని ఎక్కడో చదివాను. ప్రపంచం లో ప్రతి అణువులోనూ అమ్మ నిండి ఉందన్న సత్యాన్ని గ్రహించి, అమ్మ ముందు మంచి పుత్రుడి గా ఉండాల్సిన నేను వక్రం గా ఆలోచించాను. స్వయంభూ విగ్రహం కాని ఇప్పటి అమ్మవారి మూర్తి నా '(అ)జ్ఞానానికి' ఆనలేదు (అమ్మా! ఇలాంటి భావన చేసినందుకు నా లాంటి మూర్ఖుడిని క్షమించు). ఒకింత నిర్లక్ష్య భావన అప్పుడప్పుడు జడలు విప్పుతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రోజు మళ్లీ మళ్లీ అమ్మ తేజోమయ రూపం మనసు ని లాలిస్తోంది. ఎన్ని గంటల పాటు అయినా కను రెప్ప వెయ్యకుండా చూడాలనిపించే పురుహూతాంబ రూపం మిగతా అన్నిటినీ మరిచిపోయేలా చేస్తోంది. మునుపు రెండు సార్లు అమ్మ వారిని చూసినా కూడా నాకు ఇప్పుడు తాదాత్మ్యత ఎక్కువగా అనిపిస్తోంది.
అక్కడే వెలిసిన కుక్కుటేశ్వర స్వామిని, హూంకారిణి దేవిని (ఈ అమ్మ హూంకారం తో రాక్షస సంహారం చేసిందట), రాజ రాజేశ్వరీ దేవిని (కుక్కుటేశ్వర స్వామి వారి దేవేరి), గణపతిని దర్శించి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూజారి గారు నేను అడగకుండానే పురుహూతికా శక్తి పీఠం గొప్పతనాన్ని నాకు వివరించారు (అమ్మకి నా అజ్ఞానాన్ని తుడిచి వెయ్యాలనే సంకల్పం కలిగిందేమో!)
సతీ దేవి శరీర భాగాలలో పీఠ భాగం పడిన క్షేత్రం ఈ పిఠాపురం.
అమ్మ పీఠ భాగాన్ని చూడడం నిషేధం కాబట్టి అమ్మ ధ్యానరూపాన్ని విగ్రహంగా మలిచి గుడిలో నిలిపి పూజలు చేస్తున్నారు. ఇప్పటికీ అమ్మవారి పీఠం భూమి లోపల, భూమికి సమాంతరంగా కనీసం అర కిలోమీటరు విస్తరించి ఉందట. పిఠాపురం ఊరి మధ్యలో ఉన్న గ్రామ దేవత ఆలయం వరకు బ్రహ్మాండంగా విస్తరించి ఉందిట. యోగులు, శక్తి ఉపాసకులు అమ్మవారిని కొలవడానికి జ్ఞాన నేత్రంతో అమ్మవారిని దర్శించగలరు. సామాన్య జనుల కోసం ఈ రోజు అమ్మ వారి శక్తి పీఠ ఆలయం, మూల మూర్తి సరళంగా ఇలా దర్శనం ఇస్తున్నాయి.
బ్రహ్మాండం అంత అమ్మ వారి చైతన్యం మనసు మొత్తం నింపి వెయ్యగా, ఆత్మ అంతా అమ్మవారి కోసం తపిస్తూ ఉండగా - అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబ, కాల భైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా దేవి ఆలయాలు చూశాము. దుర్గాంబ ఆలయం దగ్గర దీపారాధన చేశాము. అది సోమవారం, ఆది దంపతులు పాద గయలో విహారం చేస్తూ అక్కడ చాల మంది భక్తులు వెలిగించిన దీపపు కాంతులలో మెరిసిపోతున్నట్టుగా ఉంది. నా లాంటి మంచు కమ్మిన మనిషి లోపల వెచ్చని వెలుగు వ్యాపిస్తున్నట్టు అనిపించింది. పున్నమి చంద్రుడి కాంతిలో, లేత చల్ల గాలుల స్పర్శలో దీపం నిర్మలం గా ప్రకాశిస్తోంది ... చెవుల నిండా శ్రావ్యం గా వినిపిస్తున్నాయి - "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః" !
ఇది దేవ భూమి. ఇక్కడి ప్రతి అణువు దైవం నడయాడిన పవిత్ర భూమి.
పిఠాపురం లో మొదట శ్రీ పాద వల్లభ సంస్థానానికి వెళ్ళాము. ఇప్పటి వరకు దత్తాత్రేయ స్వామి మొదలుకొని షిర్డీ సాయిబాబా వరకు ఉన్న గురు పరంపర లో, శ్రీ పాద వల్లభ స్వామి అవతారం విశేషం అయినది. పిఠాపురం లో దత్తాత్రేయ అంశగా ఒక పుణ్య దంపతులకి జన్మించి, గురు స్వరూపమై ఎందరో సామాన్యులను ఉద్ధరించి, వేదోక్తమైన జీవనాన్ని - ధర్మాన్ని నిలిపి, జీవుల కర్మలను బాపి, గానుగా పురం లో నివశించిన స్వామి ఆయన. స్వామి జన్మించిన ఇల్లు ఇప్పటి మహా సంస్థానం. ఆ సంస్థానం లో ఉచిత వసతి, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయి. ఆయన నీడలో ఎందరో దుఃఖం అనే మాటని పూర్తి గా మరచి ఆనంద సముద్రం లో ఓలలాడుతున్నారు. అక్కడ కొన్ని గంటలు ప్రశాంతత పరుచుకున్న వాతావరణం లో గడిపాము. అక్కడ ఔదుమ్బర వృక్షానికి ప్రదక్షిణ చేశాము.
"అధరం మధురం నయనం మధురం
వదనం మధురం వచనం మధురం
చరణం మధురం మధురమే మధురం
శ్రీ మధురాధిపతే అఖిలం మధురం"
అక్కడి నుంచి స్వయంభూ కుక్కుటేశ్వర స్వామి, పురుహుతాంబ శక్తి పీఠం, స్వయంభూ దత్తాత్రేయ మూర్తి ఉన్న పాద గయా క్షేత్రానికి వెళ్ళాము. స్వయం గా ధర్మ పరుడైనా తన వర్గం లోని వ్యక్తుల అధర్మ వర్తనాన్ని ప్రోత్సహించినందుకు, పాప పుణ్యాల ధర్మ చక్ర మార్గానికి అడ్డుగా నిలిచినందుకు త్రిమూర్తులచే శిక్షింప బడిన గయాసురుడు - శిరో గయ (అధిదేవత విష్ణువు, మంగళ గౌరీ శక్తి పీఠం), నాభి గయ (అధిదేవత బ్రహ్మ, విరజా దేవి శక్తి పీఠం), పాద గయ (అధిదేవత శివుడు, పురుహూతికా శక్తి పీఠం) - అనే మూడు క్షేత్రాల రూపం లో పూజనీయుడు అయ్యాడు. పాద గయా క్షేత్రం లో ఉన్న సరోవరం లో గయుడి పాదాలు ఉన్నాయని నమ్మకం. ఆ పవిత్ర కోనేటి నీటిని తలపై చల్లుకుని పురుహూతికా అమ్మ గుడి లోకి అడుగుపెట్టాము.
అమ్మ దేదీప్యమానం గా వెలుగుతోంది. అమ్మ తేజస్సు కనుల నిండా, మనసు నిండా పరుచుకుంది. సంధ్యా సమయంలో , దీప కాంతులలో అమ్మ కనులు, వంపులు తిరిగిన కను రెప్పలు, ముక్కెర, బేసరి - ధగ దగా కాంతులు చిమ్ముతున్నాయి. మా అమ్మ, పెద్దమ్మలు లలితా సహస్ర నామ పారాయణం చేశారు, ఈ జగజ్జననిని చూస్తూ - ఎదురుగా కూర్చుని. గంటలు గడిచాయి, అమ్మ ప్రేమ పూరితమైన దర్శనం గంటలను కరిగించేస్తోంది.
ఎన్నో రోజుల నుంచి నాలో అహంకారం జడలు విప్పుకుంది, పురుహూతికా అమ్మవారి విశిష్టత గురించి కొంచెం తక్కువగా ఆలోచించే అజ్ఞానం నాలో పాతుకు పోయి ఉంది. పిఠాపురం లో పురుహూతికా అమ్మవారి తేజస్సు భరించలేక అమ్మ వారి విగ్రహం భూమి లో దాచేశారని, ఇప్పుడు ఉన్న విగ్రహం నవీన కాలం లో ప్రతిష్ట చేసారని ఎక్కడో చదివాను. ప్రపంచం లో ప్రతి అణువులోనూ అమ్మ నిండి ఉందన్న సత్యాన్ని గ్రహించి, అమ్మ ముందు మంచి పుత్రుడి గా ఉండాల్సిన నేను వక్రం గా ఆలోచించాను. స్వయంభూ విగ్రహం కాని ఇప్పటి అమ్మవారి మూర్తి నా '(అ)జ్ఞానానికి' ఆనలేదు (అమ్మా! ఇలాంటి భావన చేసినందుకు నా లాంటి మూర్ఖుడిని క్షమించు). ఒకింత నిర్లక్ష్య భావన అప్పుడప్పుడు జడలు విప్పుతూ ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రోజు మళ్లీ మళ్లీ అమ్మ తేజోమయ రూపం మనసు ని లాలిస్తోంది. ఎన్ని గంటల పాటు అయినా కను రెప్ప వెయ్యకుండా చూడాలనిపించే పురుహూతాంబ రూపం మిగతా అన్నిటినీ మరిచిపోయేలా చేస్తోంది. మునుపు రెండు సార్లు అమ్మ వారిని చూసినా కూడా నాకు ఇప్పుడు తాదాత్మ్యత ఎక్కువగా అనిపిస్తోంది.
అక్కడే వెలిసిన కుక్కుటేశ్వర స్వామిని, హూంకారిణి దేవిని (ఈ అమ్మ హూంకారం తో రాక్షస సంహారం చేసిందట), రాజ రాజేశ్వరీ దేవిని (కుక్కుటేశ్వర స్వామి వారి దేవేరి), గణపతిని దర్శించి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూజారి గారు నేను అడగకుండానే పురుహూతికా శక్తి పీఠం గొప్పతనాన్ని నాకు వివరించారు (అమ్మకి నా అజ్ఞానాన్ని తుడిచి వెయ్యాలనే సంకల్పం కలిగిందేమో!)
సతీ దేవి శరీర భాగాలలో పీఠ భాగం పడిన క్షేత్రం ఈ పిఠాపురం.
అమ్మ పీఠ భాగాన్ని చూడడం నిషేధం కాబట్టి అమ్మ ధ్యానరూపాన్ని విగ్రహంగా మలిచి గుడిలో నిలిపి పూజలు చేస్తున్నారు. ఇప్పటికీ అమ్మవారి పీఠం భూమి లోపల, భూమికి సమాంతరంగా కనీసం అర కిలోమీటరు విస్తరించి ఉందట. పిఠాపురం ఊరి మధ్యలో ఉన్న గ్రామ దేవత ఆలయం వరకు బ్రహ్మాండంగా విస్తరించి ఉందిట. యోగులు, శక్తి ఉపాసకులు అమ్మవారిని కొలవడానికి జ్ఞాన నేత్రంతో అమ్మవారిని దర్శించగలరు. సామాన్య జనుల కోసం ఈ రోజు అమ్మ వారి శక్తి పీఠ ఆలయం, మూల మూర్తి సరళంగా ఇలా దర్శనం ఇస్తున్నాయి.
బ్రహ్మాండం అంత అమ్మ వారి చైతన్యం మనసు మొత్తం నింపి వెయ్యగా, ఆత్మ అంతా అమ్మవారి కోసం తపిస్తూ ఉండగా - అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబ, కాల భైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గా దేవి ఆలయాలు చూశాము. దుర్గాంబ ఆలయం దగ్గర దీపారాధన చేశాము. అది సోమవారం, ఆది దంపతులు పాద గయలో విహారం చేస్తూ అక్కడ చాల మంది భక్తులు వెలిగించిన దీపపు కాంతులలో మెరిసిపోతున్నట్టుగా ఉంది. నా లాంటి మంచు కమ్మిన మనిషి లోపల వెచ్చని వెలుగు వ్యాపిస్తున్నట్టు అనిపించింది. పున్నమి చంద్రుడి కాంతిలో, లేత చల్ల గాలుల స్పర్శలో దీపం నిర్మలం గా ప్రకాశిస్తోంది ... చెవుల నిండా శ్రావ్యం గా వినిపిస్తున్నాయి - "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః" !
No comments:
Post a Comment