దాదాపు అయిదు ఆరు సంవత్సరాల తర్వాత శ్రీశైల గ్రామంలో అడుగుపెట్టాము.
రకరకాల రాజకీయ పరిస్థితుల్లో నలిగిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దుస్థితి - తిరుమల, శ్రీశైలం లాంటి క్షేత్రాల మీద తీవ్ర ప్రభావం చూపింది. మరునాడు దసరా ఉత్సవాలకు భక్త జన సంద్రంగా మారాల్సిన క్షేత్రం పెద్దగా జనాలు లేక వెలవెల బోయింది. పరమాత్మకి రాజకీయ హద్దులు నిర్ణయించ ప్రయత్నించిన కొంత మంది మనుషుల అజ్ఞానానికి ఆశ్చర్యం వేసింది. ఇవి అన్నీ పక్కన పెడితే - మాకు అత్యంత వైభవమైన దర్శనం దొరికింది ఈ రద్దీ లేకపోవడం వల్ల - అయ్యవారి దగ్గర, అమ్మవారి దగ్గర కూడా. బహుశా ఈ జన్మకి మరొక సారి ఇంత గొప్ప భాగ్యం మాకు మళ్లీ దక్కకపోవచ్చు అన్నంత గొప్పగా.
ఆలయంలో అడుగుపెట్టే ప్రతి భక్తుడి నుదుటన విభూది బొట్టు పెట్టే ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. విభూది సర్వ పాప హరమ్, ఐశ్వర్య ప్రదాయకం. మనసుకి, శరీరానికి ఆరోగ్య దాయకం, శీతల ప్రదాయకం. సదా స్వామి వారి దర్శన భాగ్యాన్ని అనుభవిస్తున్న శనగల బసవన్నని బసవన్న మంటపంలో దర్శించి, వీర శైవ మంటపాన్ని దాటి, శివ నామ స్మరణలో మునిగి తేలుతూ మల్లికార్జున స్వామిని చేరాము. జీవితంలో మొదటిసారి స్వామి స్పర్శ దర్శనం లభించింది. నున్నటి చల్లటి లింగానికి తల తాటించి పునీతమయ్యాను. ఆణువణువూ శివమయం. ఆ క్షణం అక్కడ ఉన్నది మురళి అన్న పేరు ఉన్న నేను కాదు అని నాకు అనిపించిది.
బయటికి వచ్చి స్వర్ణ కాంతుల ఆలయ శిఖరానికి నమస్కరించాను. స్వామి చుట్టూరా కొలువై ఉన్న - అర్థనారీశ్వర ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం, ద్రౌపదీ పాండవ ప్రతిష్టిత శివ లింగాలు, పంచ భూత లింగాలు, రామ ప్రతిష్టిత సహస్ర లింగం, మల్లమ్మ ఆలయం, కుమార స్వామి ఆలయం (ఆయనే శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మ వారల నివాసానికి కారకుడు), అక్క మహా దేవి ఆలయం, రాజ రాజేశ్వర స్వామి - రాజ రాజేశ్వర దేవి ఆలయం, దత్తాత్రేయుడు తపస్సు చేసిన రావి చెట్టుని దర్శించాము. మల్లికార్జున స్వామి అభిషేకం కోసం నీటిని ఇచ్చే మల్లికా గుండం (ఇక్కడే సరస్వతీ నది అంతర్వాహిని గా ఉంది) స్వామి గర్భ గుడి నుంచి బయటకు వచ్చే మార్గం దగ్గరలో ఉంది. ఆ మల్లికా గుండం దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబడి నీటిలో శ్రీశైల స్వామి వారి ఆలయ శిఖరాన్ని దర్శించాము.
శ్రీశైలంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు, నా ఈ భౌతికమైన ఆలోచనతో నేను తెలుసుకోలేని అనుబంధం ఏదో నాకు అక్కడ ఉన్నది అని అనిపిస్తోంది. చలికాలపు లేత నీరెండలో శ్రీశైల దేవాలయ ప్రాంగణమంతా బంగారు వన్నెలో ప్రకాశిస్తోంది. అక్కడ నుంచి మెట్లు ఎక్కి అమ్మ భ్రమరాంబిక ఆలయంలో అడుగు పెట్టాము. నా శరీరం నెమ్మదిగా నడుస్తోంది కాని నా నా మనసు, నా ఆత్మ అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి, చాల సేపటి నుంచి.
అమ్మని ఎంత సేపు చూస్తే మాత్రం మనసుకి తృప్తి ? తేజోమయమైన అమ్మ రూపం లేత నీరెండలో మరింత ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉంటే మనసుకి వేరే ధ్యాస ఎందుకు ఉంటుంది ? అమ్మ చిన్న విగ్రహ రూపంలో ప్రకాశిస్తూ కనిపిస్తున్నా సమస్త విశ్వానికి పాలకురాలు ఆమె. కొద్ది సేపు అంత పెద్ద అమ్మకి నేను బిడ్డని అని గర్విస్తున్నాను,మరి కొద్ది సేపు అంత చిన్న విగ్రహ రూపంలో ఇమిడిపోయిన అమ్మ నాకు పసి బిడ్డ అయ్యి నా ఒడిలో పడుకున్న భావన. ఆనందం కాదు, ఉద్వేగం కాదు, భయం కాదు, ఉత్సాహం కాదు - ఒక నిర్మలమైన, నిశ్చలమైన భావం. భౌతికంగా ఎలా ఉన్నా ఆత్మ లోలోపల పొందే బ్రహ్మానందం అది.
అంత గొప్ప అష్టాదశ శక్తి క్షేత్రంలో నా సొంత గుడిలో కూర్చున్నంత స్వతంత్రంగా అమ్మని చూస్తూ, అమ్మ నామాలు చదువుకుంటూ మహదానందాన్ని అనుభవించాను. స్వామి మల్లికార్జునుడు, అమ్మ భ్రమరాంబిక అలా మమ్మల్ని ఆ మూడు రోజులు దివ్యమైన, ఆప్తమైన దర్శనాన్ని ఇచ్చి మా జీవితాన్ని సుసంపన్నం చేశారు.
రెండవ రోజున నా పుట్టిన రోజు నాడు (నిజం గా నేను పుట్టిన రోజు గొప్ప విశేషమా? ఏదో ఒక నెపంతో అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర ఎక్కువ రోజులు గడపాలనేదే నా తపన) స్వామి కి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకునే భాగ్యం మాకు దక్కింది. అంటే కాదు, అమ్మ గోమాత గా శ్రీశైల మల్లికార్జున దేవాలయం పక్కన తిరుగుతూ మాకు గోపూజ రూపంలో తనని సేవించుకునే సంకల్పాన్ని, అదృష్టాన్ని ఇచ్చింది. మా మనస్సులో దివ్య జ్యోతులు వెలిగించింది అమ్మ. దేవాలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు దగ్గర, పంచ భూత లింగాల దగ్గర జ్యోతులు వెలిగించాము.
ఆ రోజు సాయంత్రం శైలపుత్రి అలంకారంలో దసరా తొలి రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి అమ్మకి. ఆ వైభవం, ఆ శోభ చూడడానికి రెండు కన్నులు చాలవు, సముద్రమంత సంతోషాన్ని ఇముడ్చుకోగల బలమైన గుండె కావాలి. మల్లికార్జున స్వామి పక్కన భ్రమరాంబిక గా ఒక పూల పల్లకిలో - శైలపుత్రిగా మరొక పూల పల్లకిలో అమ్మ పూజలు అందుకుంటోంది. ఆ పువ్వులు, అక్షతలు, మంత్రాలు, అందరిలో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక సౌరభం - ఈ శోభని మేము చూసేందుకే అమ్మవారు మమ్మల్ని ఈ సమయంలో రప్పించుకుంది అనిపించింది. అమ్మవారు, అయ్యవారు అలా శ్రీశైల పుర వీధుల్లో విహారానికి వెళ్ళగానే మేము కళ్యాణ మంటపానికి చేరుకున్నాము - నిత్యకళ్యాణం కోసం. ఎంత మంది దంపతులు ఆ కల్యాణంలో ఉన్నారో - అక్కడ ప్రతి ఒక్క మగ వాడు హిమవంతుడి స్వరూపమే, వారి ధర్మ పత్ని మేనకా దేవి స్వరూపమే. ఎదురుగా మల్లికార్జున భ్రమరాంబికా కళ్యాణ మూర్తులు, వారి మధ్యలో బాల కుమార స్వామి. కల్యాణం అత్యంత వైభోగం గా జరిగింది. కళ్యాణ సేవలో ఉన్న ప్రతి దంపతుల చేతికి వధూ వరుల బాసికాలు తాకించారు, మంగళ సూత్రాన్నితాకి నమస్కరించుకునే అవకాశం ఇచ్చారు. కల్యాణం అత్యంత వైభవం గా జరిగింది. అమ్మవారికి అయ్యవారు తాళి కట్టారు. నా కళ్ళలో సన్నటి కన్నీటి పొర - వాళ్ళు ఆది దంపతులు, సమస్త విశ్వానికి జననీ జనకులు అని నాకు తెలుసు - కానీ, ఆ క్షణం నా కూతురు భ్రమరాంబికని స్వామి మల్లికార్జునుడికి ఇచ్చి వివాహం చేసిన ఆనందమే నాలో విహరిస్తోంది, నన్ను ఉద్వేగంలో ఒక క్షణం కుదిపేసింది. కళ్యాణ ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాము. ఆది దంపతుల కల్యాణానికి లోకం, ప్రకృతి అంతా మురిసిపోయినట్టుగా వర్షం పడుతోంది. మనసు నిండిన అనుభూతితో గుడి నుంచి బయటకు వస్తుంటే, స్వామి అమ్మవార్లు ఊరేగింపు అయ్యి వెనక్కి వస్తున్నారు. పల్లకీలు అద్భుతంగా, పెద్దగా, కళగా ఉన్నాయి. మోసేవారు ఒక యజ్ఞం లాగ మోస్తూ పరవశంలో మునిగిపోయి ఉన్నారు. నా మనసు నా స్వాధీనంలోకి వచ్చింది. వారు సమస్త విశ్వానికి జననీ జనకులు అనే సత్యం నా వివేకంలోకి ప్రసరించి - నా పితృ భావన మొత్తం తగ్గి - నేను తిరిగి అమ్మ బిడ్డడిని అయ్యాను.
మరుసటి రోజు అమ్మవారిని, అయ్యవారిని దర్శించాక ఇష్ట కామేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లాలని సంకల్పం చేశాము, వాహనం కూడా ఎక్కాము. నా మనసుకి ఉద్వేగం బాగా ఎక్కువయ్యింది, ఇష్ట కామేశ్వరి అమ్మవారిని చూసి,అమ్మ నుదుటిని స్పర్శించే క్షణం ఉత్పన్నమయ్యే ఉద్వేగానికి నేను ఏమి అవుతానో కదా అనుకుంటున్నాను. కానీ ఇష్ట కామేశ్వరి అమ్మ మమ్మల్ని ఇంకొక సారి రమ్మని, ఇప్పటికి హైదరాబాద్ తిరిగి వెళ్ళమని మా మనసులో దూరి చెప్పింది. తిరిగి హైదరాబాద్ కి ప్రయాణం అయ్యాము ఒకింత నిరాశతో.
సామానులు తీసుకుని కారులో పెడుతుంటే సొంత ఊరు ఖాళి చేస్తున్నంత బాధగా ఉంది. దారిలో సాక్షి గణపతి గుడి దగ్గర ఒక క్షణం ఆగి తిరిగి మా జనారణ్యం వైపు ప్రయాణం అయ్యాము. కారు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ నల్లమల అడవిలో గుండా బయటికి వస్తూ ఉంటే - నాకు అత్యంత ప్రియమైన దాన్ని నా చేతి నుంచి ఎవరో బలవంతంగా దూరం చేస్తున్నట్టుగా ఉంది. మనసు కెలికినట్టుగా ఉంది. తరువాత రోజు నుంచి మొదలయ్యే నా దైనందిన జీవితం ఆ క్షణం లో నాకు చాలా అప్రియంగా తోచింది. కారు ఇల్లు చేరింది కానీ నా మనసు శ్రీశైల స్వామి వారి గుడి పక్కన, అమ్మవారి గుడి దారిలో మెట్లపై చిక్కుకుని అటు స్వామికి, ఇటు అమ్మకి మధ్యగా ఉండిపోయింది. అక్కడ చెట్టు కొమ్మ మీద కోతిలానో, గువ్వ లానో కూర్చుండి కదలడం లేదు. అక్కడ చెట్టుగానో, పుట్టగానో ఉండి ఉంటే అమ్మవారిని నిత్యం చూసుకుంటూ ఆ ఆనందంలో శాశ్వతంగా నిలిచిపోయే వాడిని కదా - అని బాధ పడ్డాను. ఈ బాధ ఎలా తీరుతుంది తెలియక చాల సేపు గిలగిలలాడాను.
ఇంట్లో అమ్మవారి ముందు కూర్చుని దీపారాధన చేస్తున్నాము - ఎలా ప్రవేశించిందో తెలియదు కానీ నా మనసులో ఒక ఊరట ప్రవేశించింది. నా ఆలోచన నాతొ ఇలా పలికింది - "ఎందుకు బాధ పడుతున్నావ్ ? మురళీ భరద్వాజ అని ఇప్పుడు పిలవబడుతున్న నువ్వు అసలైన నువ్వు కాదేమో ! అంత కన్నా శాశ్వతమైనది ఒకటి నీ శరీరాన్ని,మనసుని ఆక్రమించుకుని ఉంది. అది ఎక్కడిది అనుకుంటున్నావ్ ? శ్రీశైల భ్రమరాంబిక అమ్మ దగ్గరే శాశ్వతంగా నివాసం ఉండి ఉండేదేమో ! అందుకే ఈ ఎడబాటు ఇంత బాధ పెడుతూ ఉందేమో ! బంధనాలు తీరాక ఏదో ఒక రోజు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరాల్సిందే. ఈ శరీరంతో నువ్వు ఎక్కడ తిరిగినా, ఎక్కడ ఉన్నా - చివరికి ఆ శాశ్వతమైనది అక్కడికి చేరుకుంటుంది. ఈ బిడ్డ ఆ అమ్మ ఒడిని తప్పక చేరుతుంది"
మనసు దూదిపింజలా తేలిక అయ్యింది, లోలోపల ఒక జ్యోతి వెలిగి క్రమంగా నా లోపల వెలుగు నింపుతున్న భావన కలిగింది.లేచి నా దైనందిన జీవితంలోకి ఆనందంగా వెళ్ళిపోయాను.
శ్రీశైల భ్రమరాంబికా భజ మనః శ్రీ శారదా సేవితాం

No comments:
Post a Comment