శ్రీశైలం - నాకు తెలియకుండానే నన్ను అమ్మవారి ధ్యాస వైపు నడిపించి నా జీవితంలో వెలుగులు నింపిన అతి పవిత్రమైన ప్రదేశం.
భౌతికంగా శ్రీశైలం చూడక ముందు కూడా అది నాకెంతో సుపరిచితమైన ప్రదేశంగా తోచేది. నేను తప్పకుండా శోధించి తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం / రహస్యం ఏదో శ్రీశైలంలో ఉన్నట్టు ఒక అస్పష్టమైన ఊహ నా మనసులో ఉండేది. పెళ్లి అయిన కొత్తలో తొలిసారి ప్రాపంచికమైన మేలు ఆశించి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టాను. నా జీవితంలో శుభం, నా సంతానం - ఇవన్నీ శ్రీశైల క్షేత్ర దర్శనం తర్వాత నాకు కలిగిన గొప్ప భాగ్యాలు.
కానీ, వీటి అన్నిటి కన్నా భిన్నం అయినది, నా జీవన గమనాన్నే మార్చేది అయిన ఒక పెద్ద మార్పుకి బీజం శ్రీశైల క్షేత్రంలోనే పడింది. అది నాలో కొన్నాళ్ళు నిద్రాణమై చివరికి నా ఆత్మని మేలుకొలిపి - పరమాత్మ (అమ్మవారు) లో లీనం అవడానికి అడుగులు వెయ్యమని గొప్ప ప్రేరణనిచ్చింది.
నేటికీ లౌకికమైన జీవితంలో తలమునకలు అవుతూ అరిషడ్వర్గాలతో పోరాడుతూ - పాప పంకిలమైన మనసుతో, వాక్కుతో జీవిస్తూ ఉన్నా సరే, ఇంకా ఏదో ఒక మూల నన్ను నేను ఉద్ధరించుకోమనే ప్రేరణను బలంగా నిలిపి నాలో జ్యోతిని నిరంతరం వెలిగిస్తోంది నా అమ్మ - భ్రమరాంబిక. నా సామాన్య జ్ఞానానికి అంతు చిక్కని మల్లికార్జున స్వామివారి తత్వాన్ని అణువంత అయినా అర్థం చేసుకోవడానికి నన్ను సంసిద్ధ పరుస్తూ, నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకుని జ్ఞాన భిక్ష అనుగ్రహించబడేలా నన్నుసిద్ధం చేస్తోంది మా అమ్మ భ్రమరాంబ.
అమ్మ నా ప్రాణం, అమ్మ నా లోకం.
ఇరవై ఆరేళ్ళు కన్నూ మిన్నూ కానకుండా అహంకారంగా తిరిగి, అమ్మ ధ్యాస ఏ మాత్రం లేకుండా మెలిగి - అనేక పాపాలు పోగు చేసుకుని కూర్చున్న నాకు - జీవితం అంటే ఏమిటి, జీవిత పరమావధి ఏమిటి అని అర్థం చేసుకోమనే ధ్యాస ఇచ్చింది నా జనని శైలపుత్రి. అంత వరకు నేను జీవించిన జీవితంలో పెద్ద రుచి లేదు అనిపించింది. నిజమైన ఆత్మానందం కోసం నా అన్వేషణ అలా మొదలయ్యింది.
తొలిసారి శ్రీశైల యాత్రలో అమ్మవారి ధ్యాస లేదు. తరువాత రోజుల్లో అమ్మవారి ధ్యాస మొదలైన దగ్గరి నుంచీ, శ్రీశైలం వెళ్లాలని లోలోపల సంకల్పం చేసుకున్నా అయిదు సంవత్సరాల పాటు వెళ్ళలేకపోయాను - రకరకాల కారణాల వల్ల. మనసు ఎంతో పరితపించింది. నా వైష్ణవిని తీసుకు వెళ్లి అమ్మ ముందు నిలిపి - "అమ్మా! ఇదుగో నీ వర ప్రసాదం" అని చెప్పాలి అని చాలా సార్లు అనిపించింది. ఆ కోరిక తీరే రోజు దగ్గరకొచ్చింది. నా పుట్టినరోజు నెపంతో తీరిక చేసుకుని శ్రీశైలం వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాం. మరీ ఎక్కువ ఆశ పడితే తర్వాత ఆశా భంగం అవుతుందేమో అని చాలా మనసుని అదుపులో పెట్టుకున్నాను (అని అనుకున్నాను). ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారిని, అయ్యవారిని చూడబోతున్నాను అన్న ఊహ నన్ను పట్టి కుదిపేసింది ఆనంద ఉద్వేగాలతో.
నాకు నల్లమల అరణ్యం మొత్తం శ్రీశైలం క్షేత్రం అని అనిపిస్తుంది. ఆ అరణ్యంలో జంతుజాలం, మనుషులు, చెట్టు, పుట్ట - అన్నీ పరమ పవిత్రం. నల్లమల అరణ్యం మొత్తం శివ శివానీ మయమ్. సామాన్యుల కంటికి కనిపించకుండా అనేక యోగులు, సిద్ధులు ఆ అరణ్యంలో స్వామి, అమ్మవార్ల గురించి తపస్సులో మునిగిపోయి ఉంటారట. అరణ్య ముఖద్వారం అయిన మన్ననూరు చెక్ పోస్ట్ ని ఉదయం ఆరు గంటలకు దాటిన దగ్గర నుంచి దట్టమైన నల్లమలలో ఉత్సాహ భరితమైన ప్రయాణం. నెమళ్ళు, కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దట్టమైన పొదల మాటు నుంచి జింక బయటికి వచ్చి పలకరించి పొదల్లోకి జారుకుంది. అలా గంట గడిచాక శ్రీశైల పర్వత తొట్టతొలి దర్శనం అయ్యింది.
అసలు శ్రీ పర్వతమే ఒక సంపూర్ణమైన శివ లింగ స్వరూపం. శ్రీశైలం గ్రామం ఉన్న ఆ పర్వతం పై భాగమే పానపట్టం (సాక్షాత్ అమ్మవారు), ఊరి మధ్యలో స్వామి గుడి లింగ స్వరూపం (సాక్షాత్ అయ్యవారు). పాతాళ గంగకి వెళ్ళే మెట్ల మార్గమే అభిషేక జలం లింగం నుంచి కిందకి జాలువారే మార్గం. స్వామి లింగ స్వరూపం మీద నుంచి జాలువారి ప్రవహించిన అభిషేక జలమే ఆ కృష్ణవేణమ్మ. శ్రీశైలం అణువు అణువు శివ స్వరూపం. శ్రీశైల దేవాలయం చుట్టూ ఉన్న ఊరిలో (శ్రీగిరి లింగానికి పానపట్టం) ఉండటం అంటే స్వయంగా అంబికా దేవి ఒడిలో పసి బిడ్డలా ఆడుకోవడమే. శ్రీశైల గ్రామంలో నివాసం ఉన్న రోజుల్లో మన శారీరకమైన,మానసికమైన ఎన్నో మలినాలను మనం విసర్జిస్తాము. రోజుల పసిబిడ్డ అమ్మ ఒడిలో ఉన్నప్పుడు శారీరక ధర్మం ప్రకారం మలినాలు విసర్జించడం లాంటిదే ఇది కూడా ! అయినా , శ్రీశైల తిరుమల పర్వతాల మీద అడుగు పెట్టబోయే ముందు పరమాత్మకి నమస్కారం చేసుకుని "తండ్రీ! ఈ యుగంలోని దుర్బలమైన మనుష్య ధర్మాన్ని అనుసరించి ఈ పవిత్రమైన పర్వతాన్ని అధిరోహించి నీ దర్శనార్థం కొంత సమయం ఉండబోతున్నాను, ఆ సమయంలో నా శరీర ధర్మ నిర్వహణ కోసం కొన్ని పనులు చేస్తాను. నన్ను క్షమించి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించు" అని ప్రార్థన చెయ్యాలి.
దాదాపు గంటన్నర సేపు కొండల్లోనూ లోయల్లోనూ ప్రయాణించి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఒక వైపు నుంచి రెండవ వైపుకి కృష్ణా నది మీద వంతెన దాటి వెళ్లి, పైకి పైకి ఎగబాకి చివరికి శ్రీశైల పర్వతాన్ని చేరుకుంటాం.
ఎదురుగా శ్రీశైల పర్వతం కనిపిస్తున్నట్టే ఉంటుంది. కాని గంటన్నర పైగా ఎత్తులు ఎక్కి పల్లాలు దిగి ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. ఆ ప్రకృతి అతి అద్భుతం, మనిషి భౌతిక విజ్ఞాన శాస్త్రం పరమ అద్భుతం. ప్రతి మలుపు లోనూ ఒక గుడి లేదా ప్రార్థనా మందిరం. కొంత మంది కారణ జన్ముల, యోగుల ఆశ్రమాలు అక్కడక్కడా కనిపిస్తాయి. కొన్ని పరిశోధనా కేంద్రాలు నెలకొలిపి ఉన్నాయి. ఆ క్షణానికి ఇవి అన్నీ చూసి కొంత మనసు మురిసిపోయినా మల్లికార్జున స్వామి, అమ్మ భ్రమరాంబ దర్శనం ఇంకా ఎంత సేపటికి అవుతుంది అని ప్రాణం విసిగిపోతుంది. "ఇది కేవలం మన ఊరి నుంచి శ్రీశైలం వరకు చేసే ప్రయాణం కాదేమో, బహుశా ఆ పరమాత్మని చేరేందుకు మన ఆత్మ పడే తపనకి సూక్ష్మ రూపమేమో ?" అని మనసుకి తోచింది.

No comments:
Post a Comment