ఒకరికి బాధలోనో, ఆనందంలోనో డైరీ రాసే అలవాటు ఉంది అనుకోండి; అది అలా కొనసాగుతోంది అనుకోండి. వారికి తన దగ్గరి కుటుంబ సభ్యులో, స్నేహితులో తనకి తెలియకుండా తన డైరీ చదువుతున్నారు అని తెలిసింది - అనుకోండి.
తరువాతి క్షణం నుంచి ఆ వ్యక్తి డైరీ రాసే తీరు మారిపోతుంది. తన భావాలు తన కోసం రాసుకోకుండా - అవి చదివినప్పుడు చదివే వారు ఎలా భావించాలని తను కోరుకుంటున్నారో అలా రాయడం మొదలు పెడతారు. అద్దంలా ఉండాల్సిన విషయం అబద్ధం అవుతుంది.
అలాగే ఒకడు అప్పుడప్పుడే దేవుడు, ఆధ్యాత్మికత, జీవితపు పరమార్ధం అన్ని తెలుసుకుంటున్నాడు. మానసిక ప్రశాంతత కోసం పూజ ధ్యానం లాంటివి చేసుకుంటున్నాడు. చుట్టు పక్కల ఎవరన్నా తనని గమనిస్తున్నారు అని గ్రహింపుకి వస్తే ఆ క్షణం నుంచి చూసే వారి మనసులో 'తను మంచి భక్తుడు, ఆధ్యాత్మిక బలం ఉన్నవాడు' అని భావన కలిగేలా ప్రవర్తించడం మొదలు పెడతాడు.
తనని తను తెలుసుకోవడం అనేది పక్కకి వెళ్లి ప్రపంచం తనని గుర్తించాలి అని తపన పెరిగిపోతుంది.
గుర్తింపు కోసం తపన అనేది అతి భయంకరమైన మత్తు - కల్లు, సారాయి, గంజాయి కన్నా హేయం, ప్రమాదకరం.

మనిషి లోని ఆ యుక్తాయుక్త విచక్షణ యొక్క రూపమే అమ్మవారు. అమ్మ దయతో మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందగలం.
No comments:
Post a Comment