Amman

Amman
Nitya subha mangalam

Monday, August 18, 2014

బంగారు ఇల్లాలు

ప్రాణాలు నిలిపిన పరుగు! భర్త కోసం వృద్ధనారి తెగువ

ముంబయి: అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు వైద్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వయసును లెక్కచేయకుండా మారథాన్‌లో పాల్గొని సత్తా చాటింది 65 ఏళ్ల లత కారే. పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొని సత్తా చాటింది. కాళ్లకు చెప్పులు లేకుండా పరుగు పందెంలో విజేతగా నిలిచింది.

ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండటంతో పరుగు పందెంలో పాల్గొనవద్దని కుమారుడు వారించినాపట్టించుకోలేదు. ఎంతో ఆత్మస్థయిర్యంతో మారథాన్‌లో పాల్గొన్న లత ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాలకు గర్వకారణంగా నిలిచారు. బారామతికి సమీపాన పింప్లి గ్రామానికి చెందిన లత మూడు కి.మీ. మారథాన్‌లో పాల్గొంది. 9 గజాల చీర ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా పరుగు తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. మొదటిసారి మారథాన్‌ గురించి తెలిసినప్పుడు పాల్గొంటే బాగుంటుందన్న భావన కలిగినట్లు లత తెలిపింది. విజేతకు రూ.5,000 అందజేస్తున్న విషయం తెలిసి పట్టుదలను రేకెత్తిందన్నారు.

భర్త భగవాన్‌ హృద్రోగంతో బాధపడుతున్నందున వైద్యులు ఎం.ఆర్‌.ఐ. తీయించాలని సూచించారు. భర్త వైద్యానికి రూ.15 నుంచి రూ.20 వేలు అవసరమవుతుందన్నారు. మారథాన్‌ పందెం విషయం చెవినపడింది. భర్తకు వైద్యం చేయించడానికి డబ్బు ఎంతో అవసరంగా ఉంది. ఆమె నిర్ణయానికి కుటుంబం ఆమోదం తెలిపినప్పటికీ కుమారుడు సునీల్‌ అభ్యంతరం చెప్పాడు. తల్లి వయస్సుతోపాటు ముందు రోజు జ్వరం రావడంతో ఏమవుతుందోనన్న ఆందోళనతో వారించాడు. పోటీ విషయాన్ని మరచిపోయి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని సూచించాడు. ఉదయాన్నే టాబ్లెట్‌ తీసుకు వస్తానని కుమారుడికి చెప్పి మెల్లగా పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం తన తల్లి విజేతగా నిలిచిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయినట్లు కుమారుడు సునీల్‌ తెలిపారు.

Photo: గ్రేట్ తల్లీ..గ్రేట్..

ప్రాణాలు నిలిపిన పరుగు!  భర్త కోసం వృద్ధనారి తెగువ 


ముంబయి: అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు వైద్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వయసును లెక్కచేయకుండా మారథాన్‌లో పాల్గొని సత్తా చాటింది 65 ఏళ్ల లత కారే. పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొని సత్తా చాటింది. కాళ్లకు చెప్పులు లేకుండా పరుగు పందెంలో విజేతగా నిలిచింది. ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండటంతో పరుగు పందెంలో పాల్గొనవద్దని కుమారుడు వారించినాపట్టించుకోలేదు. ఎంతో ఆత్మస్థయిర్యంతో మారథాన్‌లో పాల్గొన్న లత ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాలకు గర్వకారణంగా నిలిచారు. బారామతికి సమీపాన పింప్లి గ్రామానికి చెందిన లత మూడు కి.మీ. మారథాన్‌లో పాల్గొంది. 9 గజాల చీర ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా పరుగు తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. మొదటిసారి మారథాన్‌ గురించి తెలిసినప్పుడు పాల్గొంటే బాగుంటుందన్న భావన కలిగినట్లు లత తెలిపింది. విజేతకు రూ.5,000 అందజేస్తున్న విషయం తెలిసి పట్టుదలను రేకెత్తిందన్నారు. భర్త భగవాన్‌ హృద్రోగంతో బాధపడుతున్నందున వైద్యులు ఎం.ఆర్‌.ఐ. తీయించాలని సూచించారు. భర్త వైద్యానికి రూ.15 నుంచి రూ.20 వేలు అవసరమవుతుందన్నారు. మారథాన్‌ పందెం విషయం చెవినపడింది. భర్తకు వైద్యం చేయించడానికి డబ్బు ఎంతో అవసరంగా ఉంది. ఆమె నిర్ణయానికి కుటుంబం ఆమోదం తెలిపినప్పటికీ కుమారుడు సునీల్‌ అభ్యంతరం చెప్పాడు. తల్లి వయస్సుతోపాటు ముందు రోజు జ్వరం రావడంతో ఏమవుతుందోనన్న ఆందోళనతో వారించాడు. పోటీ విషయాన్ని మరచిపోయి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని సూచించాడు. ఉదయాన్నే టాబ్లెట్‌ తీసుకు వస్తానని కుమారుడికి చెప్పి మెల్లగా పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం తన తల్లి విజేతగా నిలిచిందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయినట్లు కుమారుడు సునీల్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతోపాటు యావత్తు గ్రామం లత సాధించిన ఘనతకు ఎంతో గర్విస్తోంది. బుల్డానాకు చెందిన లత కుటుంబం నాలుగేళ్ల కిందట ఉపాధి నిమిత్తం పింప్లి చేరుకుంది. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహమైంది. చిన్న గదిలో భర్త, కుమారుడు, కోడలు మనుమడుతో ఉంటోంది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ రోజుకు రూ.80 - 100 ఆర్జిస్తోంది. బారామతిలో ఉపాధికి కొరత లేదని వచ్చినప్పటికీ ఇక్కడ దురదృష్టం వెంటాడుతోందని వాపోయింది. నెలంతా కష్టపడితే రూ.3000-4,000 ఆర్జించడం కష్టంగా ఉందని, కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉందన్నారు. వదాన్యులు తన కుమారుడికి ఉపాధి చూపి సాయం చేయాలని విన్నవించారు.

ప్రస్తుతం ఆమె కుటుంబంతోపాటు యావత్తు గ్రామం లత సాధించిన ఘనతకు ఎంతో గర్విస్తోంది. బుల్డానాకు చెందిన లత కుటుంబం నాలుగేళ్ల కిందట ఉపాధి నిమిత్తం పింప్లి చేరుకుంది. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, కుమారుడికి వివాహమైంది. చిన్న గదిలో భర్త, కుమారుడు, కోడలు మనుమడుతో ఉంటోంది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ రోజుకు రూ.80 - 100 ఆర్జిస్తోంది. బారామతిలో ఉపాధికి కొరత లేదని వచ్చినప్పటికీ ఇక్కడ దురదృష్టం వెంటాడుతోందని వాపోయింది. నెలంతా కష్టపడితే రూ.3000-4,000 ఆర్జించడం కష్టంగా ఉందని, కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉందన్నారు. వదాన్యులు తన కుమారుడికి ఉపాధి చూపి సాయం చేయాలని విన్నవించారు.

No comments:

Post a Comment