Amman

Amman
Nitya subha mangalam

Wednesday, August 20, 2014

గాయత్రి దేవి

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే

విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున (7/10/2013) గాయత్రి దేవి గా దర్శనము ఇస్తుంది.....ఒకే దేవి కి ఇన్ని రూపాలు.....ఇన్ని రూపాలు ఆ జగదంబవే - అనే భావన కలగడానికి ఎర్పాటు చేసిన విధానం ఈ దేవి నవరాత్రులు.

సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవతా.అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు.

ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. 

ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్థితి, సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణ్వు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. స్మృతి  గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్ర శిఖః " అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరశ్శు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దైవతమును బ్రహ్మాది దేవతా శ్రేష్ఠులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం.

గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది.

లలిత సహస్ర నామం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..."

గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట.

అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరాధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి !
 
Photo: ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః 
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే 

విజయవాడ లో అమ్మవారు మూడవ రోజున (7/10/2013) గాయత్రి దేవి గా దర్శనము ఇస్తుంది.....ఒకే దేవి కి ఇన్ని రూపాలు.....ఇన్ని రూపాలు ఆ జగదంబవే,,,,,అనే భావన కలగడానికి ఎర్పాటు చేసిన విధానం ఈ దేవి నవరాత్రులు...

సకల వేద స్వరూపం గాయత్రి దేవి ! భారత దేశములో వేద కాలం నుండి ఆసేతు హిమాచల పర్యంతం, ఉపాశ్యా దైవం శ్రీ గాయత్రి పరదేవతా.అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ తల్లి ! ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖములతో , శంఖం ,చక్రం, గద, అంకుశం ధరించి దర్శన్మిస్తుంది. ఆది శంకరులు గాయత్రి దేవిని అనంత శక్తి స్వరూపిణి గా అర్చించారు.
ప్రాతః కాలంలో గాయత్రిగాను, మధ్యాన్న కాలంలో సావిత్రి గాను ఈమే ఉపాసకులతో ఆరాధనలు అందుకుంతుంది.

ఈమే వేదాలకు తల్లి కనుక వేదమాత అని, జగదంబికా అని, సర్వజనులకు సృష్టి, స్తిథి, సమ్హార కర్తలైన బ్రహ్మ, విష్ణ్వు, మహేశ్వరులను గాయత్రి పరదేవతకు అవయవాలుగా వర్ణించారు. సృతి గాయత్రి స్వరూపాన్ని " అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరః, విష్ణు హృదయం, రుద్రశికః" అని చిత్రించింది. ముఖం లో అగ్ని, శిరశ్శు లో బ్రహ్మ , హృదయంలో విష్ణువు , శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.ఇట్టి మహిమాన్వితమైన , సర్వొత్కృష్టమైన దైవతమును బ్రహ్మాది దేవతా శృఏష్ఠులు, వేదాధిష్ఠాన దేవతలైన పురుషులను, ఈ అమ్మను త్రికాల సంధ్యలలో భక్తి తో ఉపాసిస్తు ఉంటారు అని చెప్తోంది దేవి భాగవతం.
గాయత్రి...అంటే ....ప్రాణ శక్తిని రక్షించేది...

లలిత సహశ్రనామం లో.."గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజబృంద నిషేవితా..." 

గాయత్రి అనగానే అందరు గాయత్రి మంత్రము అని అనుకుంటారు కాని అది శాస్త్రము పైన ఎక్కువ అవగాహన లేని వారి మాట...

అస్సలు గాయత్రి అంటే...సంధ్యా సమయములో ఆరధించే శక్తి పేరు గాయత్రి.....శాస్త్రం ప్రకారం సంధ్యా సమయములో మనము ఆరాధించే శక్తి పేరు గాయత్రి..ఇది ఇక్కడ ప్రధానము...శాస్త్రము ప్రతిపాదించిన జగదంబ శక్తిని త్రిసంధ్యలలో ఉపాసన చేస్తే అదే గాయత్రి !

అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తొత్రము..లలితా సహ్స్రనామము..అలాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పనసరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి...

గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...సబ్ద మంత్రాన్ని మౌనముగా జపిస్తేనె దాని ఫలితము...

ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది . సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది.
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.
ఈ రోజున అమ్మవారికి అల్లపు గారెలు నివెదన చేస్తారు. గాయత్రి స్వరూపముగా వేదం చదువుకున్న బ్ర్హామణులకు అర్చన చెయ్యాలి.

అస్సలు మనము సంధ్యా సమయములో ఏ మంత్రము పఠిస్తే అదే గాయత్రి అవుతుంది...మంత్రోపదేశం జరిగిన వారు సంధ్యవేళలో ఆ మంత్రాన్ని జపిస్తే అదే గాయత్రి...మంత్రోపదేశం జరగని వారు....ఎదైన స్తొత్రము..లలితా సహస్ర నామము లాంటివి చదివినా గాయత్రి అవుతుంది..అలాగ త్రిసంధ్యలలో చెయ్యాలి...అలాగే ఉపనయనం అయిన వారు తప్పని సరిగా గాయత్రి జపం త్రిసంధ్యలలో చేసి తీరాలి...

గాయత్రి అంటే ఙ్ఞానస్వరూపిణి....ఆవిడ వేద మాత.......విద్ అనే ధాతువు నుండి వేదము అనే శబ్దము వచ్చింది...అంటే ఙ్ఞానరూపిణి అయిన అమ్మవారిని ఆరధన చేస్తాము..గాయత్రి ఉపాసన లో ...మన శ్వాస తో ఆ మంత్రాన్ని ఉపాసించడం...అంటే మనలోని ప్రాణ శక్తిని ఉపాసన చెయ్యడము...సూర్యుడి మండలం లో శక్తిని ధ్యానిస్తు సాధన చెయ్యాలి..అదే గాయత్రి అవుతుంది..మౌనముగా జపించుకోవాలి ఇలాంటి మంత్రాలు...శబ్ధ మంత్రాన్ని మౌనముగా జపిస్తేనే  దాని ఫలితము.

ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి.
బ్రహ్మ ఙ్ఞానము కలుగుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజొవంతం అవుతుంది.
గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారయణ ఫలితాన్ని ఇస్తుంది.

ఈ రోజున అమ్మవారికి అల్లపు గారెలు నివెదన చేస్తారు. గాయత్రి స్వరూపముగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు  అర్చన చెయ్యాలి. 

No comments:

Post a Comment