ఓ శ్రీమన్నారాయణ స్వామీ,
# ధర్మ సంస్థాపనకి, నిర్వహణకి తిరుగులేని మార్గ దర్శకత్వం వహించాల్సిన దేవాలయాల వ్యవస్థ - కమిటీ రాజకీయాలతో, అవినీతి పరులతో నిర్వీర్యం అయితే,
# ధార్మికమైన విద్య లేని బీదరికంలో నా దేశం ప్రజలు మగ్గిపోతూ ఉంటే,
# ఏడాది పసి ...కందు దగ్గర నుంచీ అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు అందరినీ పాపపు దృష్టితో చూసే మానసిక రోగులు అడుగడుగునా నిర్భయం గా తిరుగుతూ ఉంటే,
# అబలలు, గర్భిణుల మీద కిరాతకమైన హేయమైన నేరాలు చేసి, ప్రాణాలు తీస్తున్న కిరాతకులు ఉరి శిక్ష పడకుండా నిర్భీతితో సమాజంలో తిరుగుతూ ఉంటే,
# పసి పిల్లలు, అంగ వికలురు అనే తేడా లేకుండా బలహీనులని హింసించి ఆనందించే నీచ రాక్షస ప్రవ్రుత్తి కల మనుషులు లోకం అంతా నిండి పోతుంటే,
# ప్రపంచం మీద ఆధిపత్యం కోసం ప్రచ్చన్న యుద్ధాలు చేస్తూ, నడుమ అమాయకుల నిండు జీవితాలని గాలిలోనే తగలబెట్టిన దుష్టుల వేడుకలు పెచ్చరిల్లి పోతుంటే,
# డబ్బు కోసం బలహీనుల ప్రాణాలు మట్టుబెట్టే నీచులు స్వైర విహారం చేస్తుంటే,
# ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టగల అన్ని వ్యవస్థలు మేధావుల చేత తయారు చెయ్యబడి కూడా దౌర్జన్యం కోరల్లో సామాన్యుడు ఆక్రోశిస్తుంటే,
కలియుగం ప్రథమ పాదమే ఇంత దారుణంగా ఉంటే, నాలుగు పాదాల కలియుగం పూర్తయ్యే దాకా కల్కి అవతారంలో రాను అని చెప్పకు స్వామీ ! కత్తి పట్టుకుని వస్తావో, కలం పట్టుకుని వస్తావో, జ్ఞాన జ్యోతితోనే వస్తావో - మమ్మల్ని చీకటి నుంచి వెలుగుకి నడిపించు తండ్రీ !
No comments:
Post a Comment