Amman

Amman
Nitya subha mangalam

Monday, August 18, 2014

శివాయ గురవే నమః

కొంతమంది భక్తులు పరమశివుని మానసిక పుష్పాలతో పూజిస్తూ ఉంటారు.

అహింసా ప్రధమం పుష్పం, పుష్పమింద్రియనిగ్రహః
తృతీయం తు దయా పుష్పం క్షమా పుష్పం చతుర్ధకం
ధ్యాన పుష్పం,తపఃపుష్పం,ఙ్ఞాన పుష్పం తు సప్తమం
సత్యం చైవాష్టమం పుష్ప మేభిః తుష్యంతి దేవతాః

దైవాన్ని పూజించవల్సిన మొదటి పుష్పం అహింస. అంటే ఏ ప్రాణికీ మానసికంగా కుడా బాధకలిగించకుండా ఉండతమే ప్రథమపుష్పం. అనగా కరచరణాదికర్మేంద్రియాలూ తన అదుపులో ఉండటమే రెండవ పుష్పం. బాధలలో ఉన్నవారి బాధలు తొలగించాటానికి చేసే కృషియే దయ అనే మూడవ పుష్పం. అపకారం చేసినా ఒరిమి వహించటమే క్షమ అనే నాలుగవ పుష్పం. ఇష్టమైన దైవాన్ని నిరంతరం మనసా తలచుకోనడమేఅ ధ్యానమనే ఐదవ పుష్పం. మానసిక - వాచిక - కాయిక నియమాలు ఉండటమే తపస్సు అనే ఆరవ పుష్పం పరమాత్మను గురించిన సరైన తెలివి ఉండటమే ఙ్ఞానమనే ఏడవ పుష్పం. ఇతరులను బాధించని యధార్ధం పలకటమే సత్యము..అదే ఎనిమదవ పుష్పం.
 
ఈ ఎనిమిది రకాలు పుష్పాలతోనూ పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. అంటే పూలతో, ధూప దీపాలతో, ఫలనైవేద్యాలతో పూజించటం మానసిక పూజకు సంకేతం. అహింసాది ఉత్తమ గుణాలు అలవరుచుకోని, ఈష్వరార్పణ బుద్ధితో పరోపకారం చేస్తూ ఉండటమే మానసిక పూజ. కాని దీని అర్ధం బహిరంగ పూజ అనవసరం అనుకోవటం పొరపాటు....అంతరంగిక పూజ అతి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి...

శివాయ గురవే నమః
 

No comments:

Post a Comment