మనతో బంధంలో ఉన్న ఎవరైనా, మనని బాధ పెట్టేలా మాట్లాడినా, ఆలోచించినా మనం ఏమి చేస్తాము ? "మనం ఎంత బాధ పడ్డామో అది ఎదుటి వారికి తెలియాలి" అనుకుంటాము. అంత బాధ ఎదుటి వారు అనుభవించేలా మాట్లాడుతాము, పనులు చేస్తాము.
ఇది అందరికీ సాధారణం అయిన విషయమే. ...తప్పు లేదు. కాని, ఇలాంటి చర్య ప్రతిచర్య కర్మ బంధాలని గొలుసుకట్టు లాగా పెంచుకుంటూ పోతుంది.
ధర్మం అత్యంత సూక్ష్మం అయినది.
ఇది అందరికీ సాధారణం అయిన విషయమే. ...తప్పు లేదు. కాని, ఇలాంటి చర్య ప్రతిచర్య కర్మ బంధాలని గొలుసుకట్టు లాగా పెంచుకుంటూ పోతుంది.
ధర్మం అత్యంత సూక్ష్మం అయినది.
భర్త బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయితే, 'అవి ఎందుకు ఖర్చు అయ్యాయి' అని భార్య భర్త ని అడిగితే అది భార్య దోషం. అలాగే, భర్త ఇంటికి రాగానే 'ఆ డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయో' చెప్పకపోతే అది భర్త దోషం.
సీతమ్మ లాంటి అతి గొప్ప వ్యక్తి, మహా సాధ్వి, తేజస్విని - రావణాసురుడి భార్య అయిన మండోదరి.
రావణుడు తపస్వి కానీ గర్విష్టి, స్త్రీ లోలుడు. ఒక భర్త గా రావణుడు పూర్తిగా ధర్మం తప్పి ప్రవర్తించాడు, దుర్మార్గుడిలా అమాయకుల మీద దౌర్జన్యం చేశాడు, పక్క వాడి భార్యని అపహరించాడు - చివరికి సొంత బిడ్డలని, రాక్షస కులాన్ని నాశనం చేసుకున్నాడు.
మండోదరి దారి తప్పుతున్న భర్తని మంచి మాటలతో దారిలో పెట్టాలని చాలా ప్రయత్నించింది, చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ, తను ఏ నాడూ ధర్మం తప్పి ప్రవర్తించలేదు.
"ధర్మం అనేది ఎదుటి వారు తనతో ఎలా ఉన్నారు అన్న దానిని బట్టి కాక, తను ఎదుటి మనిషి పట్ల ఎలా ఉండాలని వేదం చెప్పిందో దాన్ని అనుసరించడమే". ఇది అత్యంత క్లిష్టమైన స్థితి. ఈ నవీన కాలపు నమ్మకాల ప్రకారం 'అర్థం పర్థం లేని ఆలోచన, అనవసర త్యాగం'.
చర్యకి ప్రతిచర్య చెయ్యడం కన్నా - దిద్దుబాటుకి ప్రయత్నించి - సఫలమైనా విఫలమైనా నిలబడి - కర్తవ్యాన్ని నిర్వహించడానికి - అంతులేని మనోబలం, ఆత్మ విశ్వాసం కావాలి. బయటకు బలహీనంగా కనిపించినా, అటువంటి వారి శక్తి అనంతమైనది. వారే, దైవం యొక్క అసలైన స్వరూపాలు.
No comments:
Post a Comment