"సారవంతమైన ధర్మం అధర్మం చేత, మలినం అంటని సత్యం అసత్యం చేత - చెడబారి పోయిన అవస్థ ఈ లోకంలో వచ్చినప్పుడు - ఆ పరిస్థితిని సరి దిద్దగల శక్తి సామర్ధ్యాలు ఉన్నవారు ఎవరైనా దక్షత ఉండి కూడా ఆ పరిస్థితిని సరిదిద్దకపోతే అలా ఉపేక్షించిన వారు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు.
మనుషులు ఎవరైనా పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా - ధర్మాన్ని నిలబెట్టేది, సత్యానికి శుభం చేకూర్చేది అయిన దైవం ఎప్పుడూ ఉంటుంది."
కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపగలిగి ఉండి కూడా ఆపలేక పోతున్నందుకు ధృతరాష్ట్రుడిని హెచ్చరిస్తూ రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణ పరమాత్మఅన్న మాటలు ఇవి. అప్పటికీ ఇప్పటికీ ఏ కాలానికి అయినా సరిపడే మాటలు ఇవి.

No comments:
Post a Comment