"శ్రీశైలం లో రుద్రాభిషేకం టికెట్ల ధర పెంచుతూ ఈవో ఆదేశాలు జారి చేశారు - అడ్వాన్సు బుకింగ్ టికెట్ ధర రూ. 1000 నుంచి రూ. 1500, కరెంటు బుకింగ్ టికెట్ ధర రూ. 600 నుంచి రూ. 1000 కి పెంచారు."
ఆర్ధిక పుష్టి ఉన్న ఆలయాల్లో కూడా ఇంకా ధరల పెంపు ఏమిటి ?
మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ దేవాలయ వ్యవస్థకి పెద్ద గుదిబండ అయ్యింది. సామాన్యుడికి, పేదవాడికి ఇష్టమైన దేవుడిని దర్శించుకుని, తృప్తిగా సేవించుకునే అవకాశం - రోజు రోజుకి తగ్గిపోతోంది.
తక్కువ ఆదాయం వచ్చే గుడులని స్థానిక కమిటీలకు ఇస్తారట, మంచి ఆదాయం వచ్చే గుడులని దేవాదాయ శాఖ 'పాలనలో' ఉంచుతారట ! దేవాలయాల ఆస్తులు, ఆదాయాలపై ఎంత ఆపేక్ష ? దేవాలయాలలో రాజకీయ ప్రాబల్యం, అధికారుల జోక్యం ఎక్కువైతే దేవాలయ వ్యవస్థ ప్రయోజనమే పూర్తిగా దెబ్బ తింటుంది. ఇప్పటికే వ్యవస్థ స్వరూపం చాల వరకు మారిపోయింది.
సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడంలో తిలా పాపం తలా పిడికెడు. ఎవరో మత మార్పిడులని చేస్తున్నారని ఆక్షేపించే ముందు - జన్మతః హిందూ ధర్మంలో ఉన్న పేద వాళ్ళని, సామాన్యులని మనమే దేవాలయ వ్యవస్థ కి దూరం చేస్తున్నామని గమనించాలి.
దైవ దర్శనంలో తర తమ బేధాలు లేని, ఆడంబరాలు లేని, డబ్బు ప్రసక్తి లేని - చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విధానం - రాష్ట్రం మొత్తం రావాలి. గుడికి కానుకలు ఇవ్వదలుచుకున్న భక్తులకి వేరే ఏర్పాటు ఉండాలి.

రాబోయే తరాలకి అసలు దేవాలయ వ్యవస్థ ఉద్దేశ్యాన్ని సక్రమంగా తెలియజేయాలి అంటే - ఒక పెద్ద ఉద్యమమే రావాలి.
No comments:
Post a Comment